కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన పలు కళాశాలల విద్యార్థులు బీడీఎస్యూ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. నిజాంసాగర్ చౌరస్తా వద్ద మానవహారం చేపట్టారు. అనంతరం అక్కడి నుంచి బస్టాండ్ వరకు ర్యాలీగా వెళ్లి అక్కడే బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరారు. బస్సులు మారుమూల గ్రామాలకు రాకపోవడం వల్ల తాము ఇబ్బంది ఎదుర్కొంటున్నామని విద్యార్థులు వాపోయారు.
ఆర్టీసీ కార్మికులకు విద్యార్థుల మద్దతు
ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు కామారెడ్డి జిల్లాలోని పలు కళాశాల విద్యార్థులు మద్దతు తెలిపారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కామారెడ్డి ఆర్టీసీ కార్మికులకు విద్యార్థుల మద్దతు
ఇవీ చూడండి: తహసీల్దార్ హత్యకు కారణమేంటి.. అసలేం జరిగింది!?