తెలంగాణ

telangana

కేసీఆర్‌ మానస పుత్రిక హరితహారం: పోచారం

By

Published : Jun 29, 2020, 11:07 PM IST

హరితహారం కార్యక్రమం.. సీఎం కేసీఆర్‌ మానస పుత్రికగా స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అభివర్ణించారు. కామారెడ్డి జిల్లాలో 43 కిలోమీటర్ల హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. స్పీకర్‌ పోచారం, జిల్లా కలెక్టర్ శరత్‌ మొక్కలు నాటారు.

కేసీఆర్‌ మానస పుత్రిక హరితహారం: పోచారం
కేసీఆర్‌ మానస పుత్రిక హరితహారం: పోచారం

సీఎం కేసీఆర్ మానస పుత్రిక హరితహారం కార్యక్రమం అని శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి కొనియాడారు. కామారెడ్డి జిల్లా గాంధారి ఎక్స్ రోడ్ నుంచి బాన్సువాడ పట్టణం వరకు చేపట్టిన 43 కిలోమీటర్ల హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపడుతూ.. ఒకవైపు హరితహారం నిర్వహించడం గొప్ప విషయమని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమం మహోన్నతమైనదని తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే వర్షం పడాలని.. వర్షం పడాలంటే చెట్లు ఉండాలని అన్నారు. అప్పుడే ప్రజలు సుభిక్షంగా ఉంటారని పేర్కొన్నారు.

ఇవీ చూడండి:హోంమంత్రి మహమూద్​ అలీకి కరోనా పాజిటివ్

ABOUT THE AUTHOR

...view details