తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆటోలోనే బిడ్డకు జన్మనిచ్చిన మహిళ

ప్రసవ వేదనలో ఉన్న ఓ తల్లిని ఆస్పత్రికి తరలించేందుకు 108 అంబులెన్స్​ అందుబాటులో లేకపోవడం వల్ల ఆటోలో తరలించారు. ఆ ఆటోలోనే శిశువుకు జన్మనిచ్చింది ఓ మహిళ. ఈ సంఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

pregnant woman gave birth to baby in auto in kamareddy district
ఆటోలోనే బిడ్డకు జన్మనిచ్చిన మహిళ

By

Published : Sep 1, 2020, 3:11 PM IST

ప్రభుత్వాలు ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా అవి అందుబాటులోకి రాక నిరుపయోగం అవుతున్నాయి. ప్రసవ వేదనతో ఉన్న ఓ తల్లిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించడానికి జరిగిన ప్రయత్నంలో 108 అంబులెన్స్​ అందుబాటులో లేకపోవడం వల్ల ఆ తల్లి మార్గ మధ్యలో ఆటోలోనే బిడ్డకు జన్మనిచ్చిన సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమర్యాగడి తండాకు చెందిన లకావత్​ రుక్కికి ఉదయం పురిటి నొప్పులు రావడం వల్ల 108 అంబులెన్స్​కు ఫోన్​ చేశారు. అందుబాటులో లేకపోవడం వల్ల ఆటోలో ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా ఆటోలోనే ప్రసవం అయింది. అనంతరం తల్లి, బిడ్డను తీసుకొని ఆస్పత్రికి చేరుకున్నారు. వైద్యులను సంప్రదించగా తల్లి, బిడ్డ క్షేమంగానే ఉన్నారని తెలిపారు.

ఇవీ చూడండి: తెదేపా బృందంపై దాడి... సీపీకి ఫిర్యాదు

ABOUT THE AUTHOR

...view details