తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రతి ఒక్కరు మాస్క్​ ధరించాలి : జిల్లా కలెక్టర్​ - masks

ప్రతి ఒక్కరూ మాస్క్​ ధరించాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్​ శరత్​కుమార్​ సూచించారు. ఎవరు మాస్క్​ ధరించకపోయినా వెయ్యి రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో సరి, బేసి విధానంలో దుకాణాలు తెరిచేలా అనుమతులిస్తున్నట్లు వెల్లడించారు.

kamareddy-district-collector-pressmeet
ప్రతి ఒక్కరు మాస్క్​ ధరించాలి : జిల్లా కలెక్టర్​

By

Published : May 8, 2020, 10:55 PM IST

కామారెడ్డి జిల్లాలో లాక్​డౌన్ మే 29 వరకు అమల్లో ఉంటుందని జిల్లా కలెక్టర్​ శరత్​కుమార్​ వెల్లడించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో దుకాణాలన్నీ 6గంటలకు మూసివేసి 7గంటల వరకు ఇంటికి చేరుకోవాలని కలెక్టర్​ సూచించారు. ఎవరు మాస్క్​ ధరించకపోయినా 1000 రూపాయల జరిమానా విధిస్తామన్నారు. కామారెడ్డి జిల్లా అధికారికంగా ఆరెంజ్ జోన్​లో ఉన్నా.. గ్రీన్ జోన్​లో ఉన్నట్లేనని వెల్లడించారు. ఎందుకంటే జిల్లాలో ఆఖరి కరోనా పాజిటివ్ కేసు ఏప్రిల్​ 12న నమోదైందని అన్నారు. గత 27 రోజులుగా ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాలేదని తెలిపారు.

పట్టణ ప్రాంతాల్లో సరి, బేసి విధానంలో దుకాణాలు తెరుస్తామని చెప్పారు. కామారెడ్డి జిల్లాలో అన్ని శాఖల ఉద్యోగులు తమ విధులకు 100 శాతం హజరవుతున్నారని కలెక్టర్​ తెలిపారు. జిల్లాలో ప్రజల సహకారంతో కరోనా కట్టడికి కృషి చేస్తున్నామని జిల్లా పాలనాధికారి శరత్​కుమార్​ వెల్లడించారు.

ఇవీ చూడండి: రాష్ట్రంలో కొత్తగా 10 కరోనా పాజిటివ్​ కేసులు నమోదు

ABOUT THE AUTHOR

...view details