తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇసుక అక్రమార్కులపై అటవీశాఖ కొరడా - ellareddy

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం తిమ్మాపూర్ అటవీ ప్రాంతంలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను అటవీ సెక్షన్ అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు.

ఇసుక అక్రమార్కులపై అటవీశాఖ కొరడా

By

Published : Aug 25, 2019, 10:11 AM IST

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో ఇసుక దందా జోరుగా కొనసాగుతోంది. భారీగా ఇసుక డంప్​లు ఏర్పాటు చేయడమే కాక అటవీ ప్రాంతం నుంచి తరలిస్తూ యథేచ్ఛగా వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అటవీశాఖ అధికారులకు ఈ విషయం తెలియకపోవడం గమనార్హం. ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వెనుక వాగు పరివాహక ప్రాంతం, తిమ్మాపూర్ చెరువు నుంచి బొల్లారం వాగు వరకు అటవీ ప్రాంతంలో రాత్రి వేళల్లో ఇసుకను రవాణా చేస్తూ నిర్మానుశ్య ప్రాంతంలో నిల్వ చేసుకుంటున్నారు. సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ... వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ నామమాత్రపు కేసులు, జరిమానాలతో సరిపుచ్చుతున్నారు. తిమ్మాపూర్, అడవిలింగాల్, బొల్లారం అటవీ ప్రాంతంలో అక్రమంగా ఇసుక తరలిస్తుండగా ఫారెస్ట్ సెక్షన్ అధికారి సాయికిరణ్ దాడి చేసి మూడు ట్రాక్టర్లను పట్టుకున్నారు.

ఇసుక అక్రమార్కులపై అటవీశాఖ కొరడా

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details