కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం పాల్వంచ వద్ద కరీంనగర్-కామారెడ్డి రోడ్డుపై బైఠాయించి రైతులు రాస్తారోకో నిర్వహించారు. సన్నరకం వరి ధాన్యానికి ప్రభుత్వం మద్ధతు ధర 2500 చెల్లించాలని డిమాండ్ చేశారు. సర్కారు చెప్పిన ప్రకారం మాచారెడ్డి మండలంలో చాలా మంది రైతులు సన్నరకం వరి ధాన్యాన్నే పండించామని తెలిపారు.
'సన్నరకానికి మద్ధతు ధర ఇవ్వకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తాం'
ఆరుగాలం కష్టపడి పండించిన సన్నరకం వరి ధాన్యానికి మద్ధతు ధర ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రైతన్నలు రోడ్డెక్కారు. కామారెడ్డి జిల్లా పాల్వంచ వద్ద కరీంనగర్-కామారెడ్డి రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు.
'సన్నరకానికి మద్ధతు ధర ఇవ్వకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తాం'
తమకు ఎకరాకు సుమారు రూ. 35 వేల వరకు ఖర్చు అయ్యిందని పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు సన్నరకం రకం ధాన్యంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సత్వరమే మద్ధతుధర ప్రకటించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని అన్నదాతలు హెచ్చరించారు.
ఇదీ చూడండి:బీంపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఈటల రాజేందర్