తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎల్లారెడ్డిలో కాంగ్రెస్​ సన్నాహక సభకు షబ్బీర్​ అలీ - ఎల్లారెడ్డిలో కాంగ్రెస్​ సన్నాహక సభకు షబ్బీర్​ అలీ

మున్సిపల్​ ఎన్నికల్లో కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్​ జెండా ఎగురవేస్తామని మాజీ ఎమ్మెల్సీ షబ్బీర్​ అలీ ధీమా వ్యక్తం చేశారు. ఎల్లారెడ్డిలో జరిగిన మున్సిపల్​ ఎన్నికల సన్నాహక సభలో ఆయన పాల్గొన్నారు.

congress will lead ellareddy municipality says shabbier ali
ఎల్లారెడ్డిలో కాంగ్రెస్​ సన్నాహక సభకు షబ్బీర్​ అలీ

By

Published : Dec 30, 2019, 11:23 PM IST

పురపాలక ఎన్నికల్లో కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్​ జెండాను ఎగురవేస్తామని మాజీ ఎమ్మెల్సీ షబ్బీర్​ అలీ ధీమా వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో కాంగ్రెస్​ మున్సిపల్​ ఎన్నికల సన్నాహక సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గత ఎన్నికల్లో అత్యధిక జడ్పీటీసీ, ఎంపీటీసీ కైవసం చేసుకున్న ఘనత కాంగ్రెస్​దేనన్నారు. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన తర్వాత విలీన గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కొనసాగేలా కృషిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి, కాంగ్రెస్​ జిల్లా అధ్యక్షుడు కైలాస్​ శ్రీనివాస్​, మహిళా కాంగ్రెస్​ జిల్లా అధ్యక్షురాలు జమున రాఠోడ్​, మాజీ ఎమ్మెల్యే జనార్దన్​గౌడ్​, ఇతర నేతలు కార్యకర్తలు హాజరయ్యారు.

ఎల్లారెడ్డిలో కాంగ్రెస్​ సన్నాహక సభకు షబ్బీర్​ అలీ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details