రైతు సమస్యల పరిష్కారానికై రాష్ట్ర కాంగ్రెస్ పిలుపు మేరకు కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు రైతు సంక్షేమ దీక్ష చేపట్టారు. రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తరుగు పేరుతో రైస్ మిల్లర్ల అక్రమాలను, ఆగడాలను అరికట్టాలని కోరారు. రైతు పండించిన పంటను ఆలస్యం చేయకుండా వెంటనే మొత్తం కొనుగోలు చేసి వెంటనే డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రకృతి వైపరీత్యాలతో తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనాలి. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కామారెడ్డిలో కాంగ్రెస్ నేతల దీక్ష - lockdown
కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు రైతు సంక్షేమ దీక్ష చేపట్టారు. రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేసి వెంటనే డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు.

కామారెడ్డిలో కాంగ్రెస్ నేతల దీక్ష