కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం లక్ష్మాపూర్ గ్రామపంచాయతీల్లో హరితహారం నిర్వహించారు. కలెక్టర్ సత్యనారాయణ ముఖ్యఅతిథిగా హాజరై ఎల్లారెడ్డి ఆదర్శ డిగ్రీ కళాశాల విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణాన్ని పెంపొందించే హరితహారంలో విద్యార్థులు భాగస్వాములు కావాలన్నారు. భావితరాలకు ఉపయోగపడే సమాజహిత కార్యక్రమాల్లో పాల్గొని అవగాహన పెంచుకోవాలన్నారు. చెట్టు ఉన్నచోటే నీరు ఉంటుందని, నీరు ఉన్న చోటే ప్రాణకోటి ఉంటుందని, జల వృద్ధికి పర్యావరణ సమతుల్యతకు తప్పనిసరిగా చెట్లు పెంచడమే మార్గమన్నారు. మొక్కలు నాటి వాటిని పరిరక్షిస్తామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.
హరితహారంలో విద్యార్థులు భాగస్వాములు కావాలి: కలెక్టర్ - ellareddy
పర్యావరణాన్ని పెంపొందించే హరితహారం కార్యక్రమంలో విద్యార్థులు తప్పనిసరిగా పాల్గొనాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ అన్నారు.
హరితహారంలో విద్యార్థులు భాగస్వాములు కావాలి: కలెక్టర్