మధ్యప్రదేశ్ నుంచి సికింద్రాబాద్ వరకు 13 మంది ఆర్మీ జవాన్లు చేపట్టిన సైకిల్ యాత్ర కామారెడ్డి జిల్లా కేంద్రానికి చేరుకుంది. కామారెడ్డి జిల్లా ప్రజలు, విద్యార్థులు పెద్ద ఎత్తున వారికి పూలమాలలతో ఘన స్వాగతం పలికారు. నిజాంసాగర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన సభలో వారి ప్రసంగించారు. మధ్యప్రదేశ్ నుంచి సికింద్రాబాద్ వరకు 959 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నామని జవాన్లు తెలిపారు. భారతీయ యువతీ యువకులు ధృడంగా ఉండాలని... చెడు వ్యసనాలకు లోనుకావద్దనే ఉద్దేశంతో ఈ సైకిల్ యాత్ర చేపట్టామని వెల్లడించారు. ధృడంగా ఉండడానికి యువతీయువకులు వ్యాయామం చేయాలని... ఆర్మీలో చేరాలని సూచించారు. స్వచ్ఛభారత్‌ను పాటించాలని పిలుపునిచ్చారు.
కామారెడ్డికి చేరుకున్న జవాన్ల సైకిల్‌యాత్ర
మధ్యప్రదేశ్ నుంచి సికింద్రాబాద్ వరకు 13 మంది ఆర్మీ జవాన్లు చేపట్టిన సైకిల్ యాత్ర కామారెడ్డికి చేరుకుంది. భారతీయ యువతీయువకులు ధృడంగా ఉండాలనే మంచి ఉద్దేశంతో ఈ యాత్ర చేపట్టినట్లు వారు తెలిపారు.
కామారెడ్డికి చేరుకున్న జవాన్ల సైకిల్‌యాత్ర