తెలంగాణ

telangana

ETV Bharat / state

అక్కడి పోలీసుల అనుమతి తీసుకోవాలి: ఎస్పీ

జోగులాంబ గద్వాల జిల్లా పుల్లూరు టోల్​ప్లాజా వద్ద పాసులు ఉన్న వాహనాలను మాత్రమే రాష్ట్రంలోకి రానిస్తున్నారు. అనుమతి లేనివాటిని సరిహద్దుల్లోనే నిలిపివేశారు. కొన్నింటిని తిప్పి పంపించారు. ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో అక్కడి పోలీసుల అనుమతితో రాష్ట్రంలో ప్రవేశించాలని వాహనదారులకు ఎస్పీ రంజన్ రతన్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

Pullur Toll Plaza, Jogulamba Gadwala District
Pullur Toll Plaza, Jogulamba Gadwala District

By

Published : May 13, 2021, 7:10 PM IST

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అనుమతిలేని వాహనాలను జోగులాంబ గద్వాల జిల్లా పుల్లూరు టోల్​ప్లాజా వద్ద తెలంగాణ పోలీసులు నిలిపివేస్తున్నారు. లాక్​డౌన్ సమయం ఉదయం 10 గంటల నుంచి తెల్లవారుజాము 6 గంటల వరకు పాసులు ఉన్న వాహనాలను మాత్రమే రాష్ట్రంలోకి అనుమతిస్తామని ఎస్పీ రంజన్ రతన్ కుమార్ స్పష్టం చేశారు.

అలంపూర్ టోల్​ప్లాజా వద్ద లాక్​డౌన్ అమలును ఎస్పీ పరిశీలించారు. ఏ గమ్యానికి చేరాలని అనుకుంటున్నారో అక్కడి పోలీసుల అనుమతితో రాష్ట్రంలో ప్రవేశించాలని వాహనదారులకు విజ్ఞప్తి చేశారు. పాసులు లేనివారిని సరిహద్దుల్లోనే నిలిపివేశారు. కొందరిని తిప్పి పంపించారు.

పుల్లూరు టోల్​ప్లాజా వద్ద ద్విచక్ర వాహనదారులకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించివేశారు. అనుమతిలేని పెద్ద వాహనాలను మాత్రం అక్కడే నిలిపివేశారు.

ఇదీ చూడండి:ఓటుకు నోటు కేసు విచారణపై హైకోర్టులో రేవంత్​ పిటిషన్​

ABOUT THE AUTHOR

...view details