తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉమ్మడి మహబూబ్​నగర్​లో మరింత పటిష్ఠ చర్యలు

ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో లాక్​డౌన్​ను అధికారులు పకడ్బందీగా అమలుచేస్తున్నారు. ఎప్పటికప్పుడు కంటైన్మెంట్​ జోన్లను డ్రోన్​కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తూ ప్రజలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా హాట్​స్పాట్​గా గుర్తించబడిన జోగులాంబ గద్వాల జిల్లాపై అధికారులు మరింత దృష్టిసారించారు.

lock down effect common mahabub nagar under the survivalence of drone camaras
కరోనా కట్టడికై ఉమ్మడి మహబూబ్​నగర్​లో మరింత పటిష్ఠ చర్యలు

By

Published : Apr 16, 2020, 6:59 PM IST

Updated : Apr 17, 2020, 8:37 AM IST

ఉమ్మడి మహబూబ్​ నగర్ జిల్లాలో లాక్​డౌన్ ప్రశాంతంగా కొనసాగుతోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం జోగులాంబ గద్వాలను హాట్​స్పాట్​గా ప్రకటించడం వల్ల ఆ జిల్లాలో కరోనా కట్టడిపై అధికారులు మరింత దృష్టి కేంద్రీకరించారు.

జోగులాంబ గద్వాల

రాష్ట్ర వైద్యారోగ్యశాఖ నివేదిక ప్రకారం ప్రస్తుతం జోగులాంబ గద్వాల జిల్లాలో 18 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గద్వాల, అయిజ, వడ్డేపల్లి, రాజోలి ప్రాంతాల్లో ఈ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే ఈ ప్రాంతాలను అధికారులు కంటైన్మెంట్ జోన్లు ప్రకటించి భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆయా జోన్లలో ప్రజలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. ఎవరూ ఇంటినుంచి బయటకు రాకుండా పకడ్బందీగా డ్రోన్​కెమెరాలతో నిఘా కొనసాగిస్తున్నారు.

ఇటీవల ఏపీలోని కర్నూల్ జిల్లా​లో ఓ ప్రముఖ వైద్యుడు అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయాడు. అతనికి పరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్లు తేలింది. అనారోగ్యం బారిన పడటానికి ముందు అతని వద్ద వైద్యం చేయించుకున్న వారి కోసం అధికారులు జల్లెడ పడుతున్నారు. స్వచ్ఛందంగా వచ్చి సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారు. ఈ మేరకు గద్వాల, గట్టు మండలాల్లో ఆ వైద్యుని వద్దకు వెళ్లి వచ్చిన వారిని కొందరిని అధికారులు క్వారంటైన్ పంపి వారి నమూనాలను పరీక్షలకోసం పంపారు. రిపోర్టులు రావాల్సి ఉంది.

మహబూబ్ నగర్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11కు, నాగర్ కర్నూల్ జిల్లాలో 2 కేసులకు మాత్రమే పరిమితమైంది. నాలుగైదు రోజులుగా కొత్త కేసులు నమోదు కాలేదు. అయినా కంటైన్మెంట్ జోన్లలో మాత్రం లాక్ డౌన్, రాత్రి వేళ కర్ఫూను పకడ్బందీగా అమలు చేస్తున్నారు.

ఇవీ చూడండి: లక్ష మంది రోగులకైనా చికిత్స: కేసీఆర్

Last Updated : Apr 17, 2020, 8:37 AM IST

ABOUT THE AUTHOR

...view details