National Handloom Day 2023 in Telangana : గద్వాల పట్టు ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. పట్టు వస్త్రంపై నూలు, సిల్కు ఇంటర్‌లాకింగ్ వ్యవస్థ... ఇక్కడి చేనేతకారుల ప్రత్యేకతగా వివరిస్తున్నారు. ఇతరులకు భిన్నంగా నూతన ఒరవడితో మగ్గం నేస్తూ నైపుణ్యం ప్రదర్శిస్తున్నారు. ఆధునిక పద్ధతుల్లో కొత్తరకం డిజైన్లతో చీరలను తయారు చేసికొండా లక్ష్మణ్ బాపూజీపురస్కారాలకు ఉమ్మడి జిల్లా నుంచి 9 మంది ఎంపికయ్యారు.
Konda Laxman Bapuji Award 2023 : ఇందులో జోగులాంబ గద్వాల జిల్లా నుంచి డిజైనింగ్ విభాగంలో గోపాలకృష్ణ, పనిలో నైపుణ్యానికి వనపర్తి జిల్లా నుంచి సుశీల శాంతారామ్ ఎంపికయ్యారు. జోగులాంబ గద్వాల జిల్లాలో 2వేల 140 జియోట్యాగ్ మగ్గాలు, నారాయణపేటలో 662, వనపర్తిలో 340, మహబూబ్‌నగర్‌లో 371, నాగర్కర్నూల్లో 15 జియోట్యాగ్ మగ్గాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తం 3వేల 458 జియోట్యాగ్ మగ్గాలున్నాయి. వీటిపై ఆధారపడి దాదాపు 8వేలకు పైగాచేనేత కుటుంబాలు జీవిస్తున్నాయి. వివిధ రకాల డిజైనర్లతో పట్టు, సీకో కాటన్ చీరలు తయారీ చేస్తుంటారు.
Pochampally silk sarees : ఉద్యోగం వదలి.. చేనేత వైపు కదిలాడు.. ఎందరికో ఆదర్శంగా నిలిచాడు
'తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాలలో మొట్టమొదటిగా ఉపయోగించే శ్రీవారి జోడు పంచెల తయారీ చేసేటువంటి ఘనత ఈ గద్వాలకి ఉంది. అంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ గద్వాల నేతన్నకు, వారు నేసే చీరలకు దేశవిదేశాల్లో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఇంటర్ లాకింగ్ సిస్టమ్తో చీరలు నేస్తాం. ఇంటర్ లాకింగ్ అంటే పట్టుపైన నూలు, సిల్క్ రెండు కలిపి నేయడం. అంతటి చక్కని నైపుణ్యం కలిగిన నేత కార్మికులు ఇక్కడ ఉన్నారు.' - భీమేష్, చేనేత కార్మికుడు