గర్భిణీ మరణించిన ఘటనపై హెచ్‌ఆర్‌సీ ఆగ్రహం - telangana hrc latest news
![గర్భిణీ మరణించిన ఘటనపై హెచ్‌ఆర్‌సీ ఆగ్రహం hrc serious on pregnent death in jogulamba gadwala district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6972658-thumbnail-3x2-hrc.jpg)
13:26 April 28
గర్భిణీ మరణించిన ఘటనపై హెచ్‌ఆర్‌సీ ఆగ్రహం
200 కిలోమీటర్లు - ఆరు ఆస్పత్రులు శీర్షికతో ఈనాడులో వచ్చిన కథనాన్ని హెచ్‌ఆర్‌సీ సుమోటోగా స్వీకరించింది. ఆరు ఆస్పత్రులు తిరిగి నిండు గర్భిణీ మరణించిన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. జూన్ 16లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని కుటుంబ సంక్షేమశాఖ, మహబూబ్‌నగర్ డీఎంహెచ్‌వో, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్, కోఠి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు ఆదేశాలు జారీ చేసింది. జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం యాపదిన్నెకు చెందిన జెనీలా (20) ప్రసవం కోసం సుమారు 200 కి.మీ. దూరం తిరిగి ప్రాణాలు కోల్పోయింది.
ఇదీ చూడండి:'200 కిలోమీటర్లు... 6 ఆసుపత్రులు... దరిచేరని తల్లి ప్రయాణం'
TAGGED:
telangana hrc latest news