తెలంగాణ

telangana

By

Published : Jun 18, 2020, 10:21 PM IST

ETV Bharat / state

రేకుల ఇంటికి రూ.1.80 లక్షల కరెంటు బిల్లు

రెండు గదుల రేకుల ఇంటికి వచ్చిన ఒక్క నెల కరెంటు బిల్లును చూసి ఆ ఇంటి యజమాని అవాక్కయ్యాడు. లాక్​డౌన్​ కాలంలోని బిల్లు రీడింగ్​ తీయగా.. అక్షరాల ఒక లక్షా ఎనభై వేల రూపాయలు వచ్చింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రం వెంకట్రావ్​పల్లిగ్రామంలో ఇది చోటు చోసుకుంది.

The current bill for petals home is Rs 1.80 lakh
రేకుల ఇంటికి రూ.1.80 లక్షల కరెంటు బిల్లు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రం వెంకట్రావ్​పల్లి గ్రామానికి చెందిన శీలం సదయ్య పశువులను జీవనోపాధిగా ఎంచుకుని జీవిస్తున్నాడు. సాధారణంగా నెలకు రూ.100 నుంచి రూ.120 విద్యుత్ బిల్లు రావాల్సి ఉండగా ఈ ఏడాది ఫిబ్రవరిలో జనవరి బిల్లు రూ.41,210 వచ్చింది. సద్దయ్య సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. దానిని సరిచేస్తామన్న అధికారులు లాక్​డౌన్ వల్ల నిర్లక్ష్యం చేశారు.

కరెంట్​ బిల్లు.. అక్షరాల లక్ష దాట్టింది..

అయితే.. పాత బిల్లుతో కలిపి ఈనెల 7న రూ.1.80 లక్షల కరెంటు బిల్లు రావడం వల్ల సదయ్య కుటుంబ సభ్యులు నిర్ఘాంతపోయారు. కూలి పనిచేసుకునే తాము అంత బిల్లు కట్టలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని వేడుకుంటున్నారు.

ఇదీ చూడండి:కరోనాపై మీరు చేస్తున్నది సరిపోదు.. సర్కారుకు హైకోర్టు కీలక ఆదేశాలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details