జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరులో భూపాలపల్లి-హన్మకొండ జాతీయ రహదారిపై శనివారం రాత్రి ఓ లారీ రోడ్డు పక్క ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీనితో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి తీగలు రహదారిపై చెల్లా చెదురుగా పడిపోయాయి. ఫలితంగా విద్యుత్ సరఫరా నిచిలిపోయింది.
విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న లారీ... ట్రాఫిక్కు అంతరాయం - జయశంకర్ భూపాలపల్లి తాజా వార్త
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురంలోని భూపాలపల్లి-హన్మకొండ జాతీయ రహదారిపై ఉన్న విద్యుత్ స్తంభాన్ని లారీ ఢీ కొట్టింది. ఫలితంగా వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న లారీ
ఆ మార్గంలో రాకపోకలకు అంతరాయం కలిగింది. జాతీయ రహదారి కావడం వల్ల కిలోమీటరు పొడవున వాహనాలు బారులు తీరాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించి స్తంభాన్ని పక్కకు తీయించారు.
విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న లారీ
ఇవీ చూడండి: 'ముఖ్యమంత్రి కేసీఆర్.. దేవుళ్ల పేరు చెప్పి దోచేశారు'