తెలంగాణ

telangana

ETV Bharat / state

కాళేశ్వర ఆలయ పాలకమండలి ఛైర్మన్​గా రాం నారాయణ గౌడ్

కాళేశ్వర ఆలయం పాలకమండలి ఛైర్మన్​గా గంట రాం నారాయణ గౌడ్ ఎన్నికయ్యారు. ప్రస్తుత ఛైర్మన్ అకాల మరణంతో తిరిగి ఛైర్మన్ ఎంపిక అనివార్యమైంది.

కాళేశ్వర ఆలయ పాలకమండలి ఛైర్మన్ గా రాం నారాయణగౌడ్
కాళేశ్వర ఆలయ పాలకమండలి ఛైర్మన్ గా రాం నారాయణగౌడ్

By

Published : Sep 29, 2020, 1:06 PM IST

కాళేశ్వర దేవస్థానం 11వ పాలకమండలి ఛైర్మన్​గా కాళేశ్వరానికి చెందిన గంట రాంనారాయణగౌడ్ ఎన్నికయ్యారు. ఛైర్మన్​గా వ్యవహరిస్తున్న బొమ్మెర వెంకటేశం అకాల మృతితో తిరిగి ఛైర్మన్ ఎంపిక అనివార్యమైంది. సోమవారం ఆలయ ఆవరణలో ప్రస్తుత ధర్మకర్త రాం నారాయణ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఆలయ ఇంఛార్జి కార్యనిర్వహణాధికారి మారుతి సమక్షంలో ఆలయ ధర్మకర్త సత్యనారాయణగౌడ్ బలపర్చగా... మరో ఇద్దరు ధర్మకర్తలు ప్రతిపాదించారు. మిగిలిన సభ్యులు చేతులెత్తి మద్దతు పలకగా ఛైర్మన్ లాంఛన ప్రాయమైంది. మొదటిసారిగా కాళేశ్వరానికి చెందిన వ్యక్తి ఆలయ ఛైర్మన్​గా బాధ్యతలు చేపట్టగా స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.

ఆలయ ఛైర్మన్ హోదా వచ్చింది తనకు కాదని కాళేశ్వర గ్రామానికి ఆ గౌరవం దక్కిందని రాం నారాయణ గౌడ్ అభిప్రాయపడ్డారు. తనకు ఛైర్మన్ హోదా కల్గించిన పెద్దపల్లి జిల్లా పరిషత్ ఛైర్మన్ పుట్టా మధు, జయశంకర్ జిల్లా ఛైర్ పర్సన్ శ్రీహర్షిణి, ధర్మకర్తల మండలికి రాంనారాయణగౌడ్ కృతజజ్ఞతలు తెలియజేశారు.

ఇదీ చూడండి: యాదాద్రి ఆలయానికి తుదిమెరుగులు.. శరవేగంగా పనులు

ABOUT THE AUTHOR

...view details