తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఎం రిలీఫ్​ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే గండ్ర - jayashankar bhupalpally district news

భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్​ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి పంపిణీ చేశారు. తెరాస పార్టీ 2020 క్యాలెండర్​ను ఆవిష్కరించారు.

MLA Gundra CM Relief Fund checks distributed at bhupalpally
సీఎం రిలీఫ్​ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే గండ్ర

By

Published : Jan 24, 2020, 5:25 PM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లిలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి సీఎం రిలీఫ్​ ఫండ్ చెక్కులను 13 మంది లబ్ధిదారులకు అందజేశారు. తెరాస పార్టీ 2020 క్యాలెండర్​ను ఆవిష్కరించారు. దీర్ఘకాల వ్యాధితో బాధపడుతున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం సీఎం సహాయనిధి నుంచి వైద్య ఖర్చులు అందిస్తామన్నారు.

ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చి దరఖాస్తు చేసుకోవాలన్నారు. సొంత డబ్బులతో వైద్యం చేసుకున్న వాళ్లకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి 3 లక్షల 44 వేల 500 రూపాయల చెక్కులను అందజేశారు. 2019లో అనుకున్న స్థాయిలో వర్షాలు పడ్డాయన్నారు. 2020లో కూడా మంచి వర్షాలు కురిసి రైతులు సంతోషంగా ఉండాలని అన్నారు.

సీఎం రిలీఫ్​ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే గండ్ర

ఇదీ చూడండి : చిన్నారి అపహరణ కేసు సుఖాంతం..

ABOUT THE AUTHOR

...view details