తెలంగాణ

telangana

By

Published : Apr 13, 2021, 12:38 PM IST

ETV Bharat / state

ప్లవనామ సంవత్సరం తులారాశి వారికి ఎలా ఉందంటే!

నూతన ఉత్తేజం తీసుకొచ్చే ఉగాది పండుగ వచ్చేసింది. ఈరోజు నుంచి గ్రహబలం కూడా మారుతుందనేది తెలుగు ప్రజల నమ్మకం. మరి ప్లవ నామ సంవత్సరం తులా రాశిఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం రండి.

libra horoscopes, plava year libra horoscopes
తులా రాశిఫలాలు, ప్లవనామ సంవత్సరం రాశిఫలాలు

  • ఆదాయం-2
  • వ్యయం-8
  • రాజపూజ్యం-1
  • అవమానం-5

తులా రాశి వారికి ఈ ఏడాది కలిసివస్తుంది. అదృష్టవంతులు అవుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆశించిన ఫలితం వస్తుంది. ఆటంకాలు తొలగుతాయి. ఆగిన పనులు పునః ప్రారంభమవుతాయి. పట్టుదలతో కార్యసిద్ధిని సాధిస్తారు. కీర్తి దశదిశలా వ్యాపిస్తుంది. జీవితాశయం నెరవేరుతుంది. విద్యార్థులకు అద్భుతమైన కాలం. అధికార లాభం ఉంది. అనేక మార్గాల్లో విజయం లభిస్తుంది.

ఎటుచూసినా మీదే పైచేయి అవుతుంది. తొందర పనికిరాదు. ఆపదల నుంచి బయటపడతారు. ఇంట్లోని పెద్దల సహకారం తప్పనిసరిగా తీసుకోవాలి. బుద్ధిబలంతో భారీ లక్ష్యాలను సాధిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. తగినంత విశ్రాంతి తీసుకోవాలి. శని కేతు శ్లోకాలు చదువుకోవాలి.

ఇదీ చదవండి:వచ్చెను ఉగాది.. తెచ్చెను వసంతం!!

ABOUT THE AUTHOR

...view details