తెలంగాణ

telangana

జనాభా అనేది ఒక ఆస్తి వంటిది: కలెక్టర్ అజీమ్

By

Published : Jul 11, 2020, 8:17 PM IST

ప్రకృతి వనరులకు అనుగుణంగా జనాభా పెరుగుదల ఉండాలని జయశంకర్​ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మహమ్మద్ అబ్దుల్ అజీమ్ పేర్కొన్నారు. దేశంలో సహజ వనరులకు అనుగుణంగా జనాభా ఉందని వెల్లడించారు. జిల్లాలోని ప్రజలు బాధ్యతగా జనాభా నియంత్రణకు సహకరించాలని కోరారు.

Jayashankar Bhupalpally District Collector Mohammad Abdul Azim talk on World Population day
జనాభా అనేది ఒక ఆస్తి వంటిది

శనివారం ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితో కలెక్టర్​ మహమ్మద్​ అబ్దుల్​ అజీమ్​ సమీక్ష సమావేశం నిర్వహించారు. జనాభా అనేది ఒక ఆస్తి వంటిదని తెలిపారు. జనాభా ఎక్కువ ఉన్నా, తక్కువ ఉన్న గాని దేశాభివృద్ధి సరిగా ఉండదని పేర్కొన్నారు. దేశంలో అందుబాటులో ఉన్న సహజ వనరులు, స్థితిగతులకు అనుగుణంగా జనాభా ఉన్నప్పుడు దేశం అభివృద్ధి సాధిస్తుందని వెల్లడించారు.

అదేవిధంగా జిల్లాలోని ప్రజలు బాధ్యతగా జనాభా నియంత్రణకు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లాలో కుటుంబ నియంత్రణ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసిన వైద్య, ఆరోగ్య సిబ్బందిని జిల్లా కలెక్టర్ నగదు పురస్కారంతో సన్మానించారు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డాక్టర్ తిరుపతి, డాక్టర్ ఉమాదేవి, జిల్లా సంక్షేమ అధికారి శ్రీదేవి పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details