తెలంగాణ

telangana

ETV Bharat / state

పేదలకు ఉపాధి కల్పించాలి: కలెక్టర్

నీటిపారుదల కాలువల పూడికతీత పనులలో అత్యధిక మందికి కూలీ పని కల్పించాలని జయశంకర్​ జిల్లా కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ అజీం అధికారులను ఆదేశించారు. లాక్​డౌన్​ కారణంగా ఉపాధి కోల్పోయిన పేదలకు ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Jayashankar Bhupalapally Collector Mohammed Abdul Azim Meeting with MPDO and Irrigation Officers
పేదలకు ఉపాధి కల్పించాలి

By

Published : Jun 19, 2020, 6:30 AM IST

జయశంకర్ భూపాలపల్లి జిల్లా సింగరేణి క్లబ్ హౌస్​లో ఎంపీడీవోలు, నీటిపారుదల ఇంజినీర్లతో కలెక్టర్​ మహ్మద్​ అబ్దల్​ అజీం సమావేశం నిర్వహించారు. జలహితం కార్యక్రమంలో భాగంగా నేటి నుంచి చెరువులు, కుంటలు, కాలువలో పూడికతీత, ముళ్ల కంపల తొలగింపు పనులు చేపట్టాలని ఆదేశించారు. లాక్​డౌన్​ వలన ఉపాధి కరువైన నిరుపేదలకు ఈ కార్యక్రమం ద్వారా అత్యధికంగా లబ్ధి పొందేలా చర్యలు తీసుకోవాలని వెల్లడించారు.

18 సంవత్సరాలు నిండిన అర్హులైన ప్రతి ఒక్కరికీ జాబ్ కార్డు ఇచ్చి ఉపాధి కల్పించాలని అధికారులను ఆదేశించారు. పూడికతీత పనులను లక్ష్యంగా పెట్టుకొని పనులు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి, జిల్లా వ్యవసాయ అధికారి డాక్టర్ నగేష్, డివిజనల్ పంచాయతీ అధికారి సుధీర్, ఇరిగేషన్ డీఈ ప్రసాద్, ఏఈలు, ఎంపీడీవోలు, తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details