తెలంగాణ

telangana

ETV Bharat / state

పట్టా కోసం భిక్షాటన

గిట్టుబాటు ధర రాక ఓ వైపు అల్లాడుతుంటే.. చిన్న చిన్న పనులకు లంచం అడిగే అధికారుల తీరుతో విసిగిపోతున్నారు రైతులు. పట్టాదారు పాసు పుస్తకం కోసం పోతే.. లంచం అడిగాడు ఓ వీఆర్వో. డబ్బులు లేక భిక్షాటన చేసి ఆ మొత్తం సేకరించాడు అన్నదాత.

By

Published : Feb 25, 2019, 8:24 PM IST

Updated : Feb 25, 2019, 9:00 PM IST

పాసుపుస్తకం కోసం భిక్షాటన

పాసుపుస్తకం కోసం భిక్షాటన
తన భూమికి పట్టాదారు పాసుపుస్తకం జారీకి డబ్బులు డిమాండ్​ చేసిన వీఆర్వో జేబు నింపడానికి భిక్షావతారం ఎత్తాడో రైతు. ములుగు జిల్లా వెంకటాపూర్​ గ్రామానికి చెందిన రైతు దేవేందర్​ పాసుపుస్తకం మంజూరు చేయాలని తహసీల్దార్​ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. రోజుల తరబడి కార్యాలయం చుట్టూతిప్పించుకున్న వీఆర్వో చివరికి లంచం డిమాండ్​ చేశాడు. గత్యంతరం లేని స్థితిలో ఆ రైతు బిక్షాటన కోసం రోడ్డెక్కాడు.

20 ఏళ్లుగా సాగు...

20 ఏళ్లుగా ఇదే భూమిలో సాగుచేస్తున్నా.. పట్టాదారు పాసు పుస్తకం జారీచేసేందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆరోపించాడు. లంచం అడిగిన వీఆర్వోపై వెంటనే చర్యలు తీసుకొని, బాధితునికి న్యాయం చేయాలని మిగతా రైతులు ఉన్నతాధికారులను కోరుతున్నారు.

ఇవీ చదవండి:భాజపాతో నాకేం సంబంధం?

Last Updated : Feb 25, 2019, 9:00 PM IST

ABOUT THE AUTHOR

...view details