జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండలోని సొసైటీలో మొక్కజొన్న రైతులు ఆందోళనకు దిగారు. రైతుల నుంచి మక్కలు కొనుగోలు చేసి గోదాంకి పంపిన తర్వాత లారీని అధికారులు మళ్లీ వెనక్కి పంపించారు. రేగొండ, రంగయ్యపల్లి గ్రామాలకు చెందిన సుమారు 8 మంది రైతులు 5 రోజుల క్రితం 450 మొక్కజొన్నల బస్తాలు సొసైటీలో వేసి లారీ లోడ్ చేయించారు.
తేమ ఎక్కువుందని లోడ్ వెనక్కి... మొక్కజొన్న రైతుల ఆందోళన
ఆరుగాలం కష్టపడి పంట పండించటం ఒక ఎత్తు అయితే... వచ్చిన దిగుబడిని అమ్ముకోవటం మరో ఎత్తు అయింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ సొసైటీలో మక్కల్లో తేమ శాతం ఎక్కువగా ఉందని కొనుగోలు చేసి గోదాంకి పంపించిన లారీని తిరిగి వెనక్కి పంపించిన ఘటన నెలకొంది.
తేమ ఎక్కువుందని లోడ్ వెనక్కి... మొక్కజొన్న రైతుల ఆందోళన
గోదాంకి వెళ్ళిన మొక్కజొన్నలో తేమ శాతం ఎక్కువ ఉందని అధికారులు వెనక్కి పంపించారు. సొసైటీకి వచ్చిన లారీని అన్లోడ్ చేసేందుకు హమాలీ ఛార్జీలు రైతులే చెల్లించాలన్నారు. ఎవరి బస్తాలు వారు తీసుకెళ్లాలని నిర్వాహకులు చెప్పగా.... రైతులు వాగ్వాదానికి దిగారు. మక్కల్లో తేమశాతం ఎక్కువగా ఉందని... తగ్గిన తర్వాత మళ్లీ పంపిస్తామని సొసైటీ అధికారి రైతులను బుజ్జగించారు.