రాబోవు 50 సంవత్సరాల వరకు భూగర్భ జలమట్టం నిలిచి ఉండేలా వాటర్‌షెడ్ పనులను చేపట్టాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ అజీం అధికారులను ఆదేశించారు. వాటర్‌షెడ్ నిర్మాణంపై తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఫారెస్ట్ అధికారులు, ఈజీఎస్ సిబ్బందికి నిర్వహించనున్న రెండురోజుల వర్క్ షాప్ కార్యక్రమం బుధవారం జిల్లా కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయం ప్రకృతి భవన్లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మహారాష్ట్రలో భూగర్భ జలాలు లేని గ్రామాల్లో వాటర్‌షెడ్ కార్యక్రమం ద్వారా ఏ విధంగా భూగర్భజలాలను పెంపొందించారో ప్రొజెక్టర్ ద్వారా వివరించారు.
'భూగర్భజలాలు లభ్యమయ్యేలా వాటర్షెడ్ల నిర్మాణం చేపట్టాలి' - భూగర్భజలాలు
నీరు ఉన్న చోటనే మానవ మనుగడ సాగుతుందని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ అజీం అన్నారు. రాబోవు 50 ఏళ్ల వరకు భూగర్భ జలాలు నిలిచి ఉండేలా వాటర్‌షెడ్ నిర్మాణాలను చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
నీరు ఉన్నచోటనే మానవ మనుగడ సాగుతుందని, జిల్లాలో భూగర్భ జలాలు లేని ప్రాంతాలను గురించి ఆయా ప్రాంతాలలో డ్రోన్ సాంకేతిక పద్ధతి ద్వారా సర్వే చేసి రాబోయే 50 సంవత్సరాల వరకు భూగర్భ జలాలు లభ్యమయ్యేలా వాటర్ షెడ్ల నిర్మాణం చేపట్టాలని అన్నారు. వాటర్షెడ్ల నిర్మాణానికి మానవ వనరులను డీఆర్డీఏ ద్వారా అందిస్తే మిషనరీలను కలెక్టర్ నిధుల నుంచి ఇస్తామని జిల్లా పాలనాధికారి తెలిపారు. భౌగోళిక పరిస్థితులు, నేల స్వభావం, నీటి లభ్యత ఆధారంగా ప్రాంతాలను విభజించి నీటి కుంటలు, చిన్న నీటి కుంటలు, చెక్ ఫాల్స్, చెక్‌డ్యాంల నిర్మాణం తదితర నీటి సంరక్షణ పనులను చేపట్టాలని సూచించారు.
ఇవీ చూడండి: విదేశాల నుంచి వచ్చేవారికి వైద్యపరీక్షలు