పెండింగ్‌లో ఉన్న నిర్మాణ పనులను తర్వగా పూర్తి చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ మహ్మద్ అబ్ధుల్ అజీం పంచాయతీరాజ్, ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని భూపాలపల్లి పోలీస్‌స్టేషన్ ఆవరణలో చేపట్టిన ఎస్సై నివాస భవన నిర్మాణ పనులను పరిశీలించగా బడ్జెట్ ఉన్నంతవరకు నిర్మాణం జరిగిందని.. మొత్తం పూర్తి చేయాలంటే మరో రూ.20 లక్షలు కావాల్సి ఉంటుందని పంచాయతీరాజ్ ఈఈ రాంబాబు వివరించారు. భవన నిర్మాణానికి కావాల్సిన నిధులను మంజూరు చేస్తానని కలెక్టర్ తెలిపారు.
అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్ మహ్మద్ అబ్దుల్ అజీం.. పంచాయతీరాజ్, ఇంజినీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. జిల్లావ్యాప్తంగా పూర్తి చేసిన పనులకు అభినందనలు తెలిపారు. ఇంకా పెండింగ్‌లో ఉన్న నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.
జిల్లాలో జరుగుతున్న నిర్మాణ పనులు పరిశీలించిన కలెక్టర్
ప్రధాన రహదారి నుంచి భాస్కర్ గడ్డ వెళ్లే మార్గంలో జరుగుతున్న వంతెన నిర్మాణం పనులను కలెక్టర్.. అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం గుడాడ్‌పల్లిలో నిర్మించిన సీసీ రోడ్డు పర్యవేక్షించి.. నాణ్యతతో నిర్మించినందుకు అధికారులను అభినందించారు. ఆ తర్వాత శ్యామ్‌నగర్- సోలిపేట రోడ్డును పరిశీలించారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న పనులను వీలైనంత తర్వగా పూర్తిచేయాలని ఆదేశించారు.
ఇదీ చూడండి:-యూనిఫామ్‌కు మ్యాచింగ్ మాస్కులు తప్పనిసరి..!