తెలంగాణ

telangana

ETV Bharat / state

'అవగాహన వచ్చింది' - jangaon district

గతంలో గ్రామ సర్పంచ్​గా ఎన్నికైతే తమకు ఎలాంటి బాధ్యతలు ఉంటాయో, ఊరిని ఎలా అభివృద్ధి చేయాలో తెలుసుకునే లోపే వారి పదవీ కాలం పూర్తయ్యేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. అభివృద్ధి పథంలోకి ఎలా తీసుకుని వెళ్లాలో తెలిసిందంటున్నారు నూతనంగా ఎన్నికైన సర్పంచ్​లు.

సర్పంచ్​లకు శిక్షణ తరగతులు

By

Published : Mar 5, 2019, 3:47 AM IST

Updated : Mar 5, 2019, 5:58 PM IST

సర్పంచ్​లకు శిక్షణ తరగతులు
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్​లకు ప్రభుత్వం శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. సర్పంచ్​ బాధ్యతలపైవివిధ శాఖలకు చెందిన నిపుణలు శిక్షణ ఇస్తున్నారు. జనగామ జిల్లాలోని 301 గ్రామపంచాయతీల సర్పంచ్​లకు మూడు విడతలుగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. శిక్షణ పూర్తైన అనంతరం వారికిసర్టిఫికెట్లు అందజేస్తున్నామని జిల్లా పంచాయతీ అధికారి రవి కుమార్​ తెలిపారు.

సర్పంచ్​గా ఎన్నికైన అనంతరం బాధ్యతలు ఎలా నిర్వహించాలో తెలియక సతమతం అయ్యామని సర్పంచ్​లన్నారు.

ఆదర్శగ్రామాలుగా మారుస్తాం..!

ఈ శిక్షణ తరగతులతో ప్రతి పనిపై అవగహన ఏర్పడిందని తమ గ్రామాలను ఆదర్శ గ్రామలుగా తీర్చిదిద్దడానికి ఈ శిక్షణ తరగతులు ఉపయోగపడుతాయని నూతన సర్పంచ్​లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చూడండి:డేటా ఎక్కడిది?

Last Updated : Mar 5, 2019, 5:58 PM IST

ABOUT THE AUTHOR

...view details