జనగాం జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలంలో ఎమ్మెల్యే రాజయ్య పర్యటించారు. శివునిపల్లిలో నిర్వహించిన గ్రామసభకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. గ్రామాల అభివృద్ధికి పార్టీలకు అతీతంగా అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. శివునిపల్లి గ్రామంలోని ప్రధాన రహదారి విస్తరణకు వ్యాపారస్తులు సహకరించాలన్నారు. గ్రామంలోని చెరువులను దేవాదుల ప్రాజెక్టు ద్వారా నింపేందుకు ప్రణాళికల సిద్ధం చేయాలని నీటి పారుదల సిబ్బందికి సూచించారు.
శివునిపల్లిలో ఎమ్మెల్యే రాజయ్య పర్యటన - స్టేషన్‌ఘన్‌పూర్
స్టేషన్ ఘన్పూర్ మండలం శివునిపల్లి గ్రామసభకు ఎమ్మెల్యే రాజయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామాభివృద్ధికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
శివునిపల్లిలో ఎమ్మెల్యే రాజయ్య పర్యటన