రైతును రాజుగా చూడాలన్న సంకల్పంతోనే ముఖ్యమంత్రి నియంత్రిత పంట సాగు విధానం అమలు చేస్తున్నారన్నారు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు. జనగామ జిల్లా పాలకుర్తి మండల పరిధిలోని మంచుప్పల గ్రామంలో ఆయన పర్యటించారు. గ్రామంలో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే.. సీజనల్ వ్యాధులు మన దరికి రావన్నారు. ఎవరైనా బహిరంగంగా చెత్త వేస్తే.. వెంటనే రూ. 500 జరిమానా వేయాలని అధికారులను ఆదేశించారు.
రైతును రాజుగా చూడాలన్నదే ప్రభుత్వ సంకల్పం: మంత్రి ఎర్రబెల్లి - మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
జనగామ జిల్లా మంచుప్పల గ్రామంలో జరిగిన పల్లె ప్రగతి కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే.. సీజనల్ వ్యాధులు మన దరికి చేరవని.. గ్రామాలన్నీ పరిశుభ్రంగా మార్చేందుకే ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టామని తెలిపారు.
పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి
ఒకసారి జరిమానా విధించిన తర్వాత కూడా మళ్లీ చెత్త వేస్తే.. రెండోసారి రూ. 5000 జరిమానా వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ నిఖిల, జడ్పీ ఛైర్మన్ సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.