తెలంగాణ

telangana

జనగామ జిల్లా భాజపా నూతన అధ్యక్షుడి ప్రమాణస్వీకారం

By

Published : May 24, 2020, 11:46 PM IST

జనగామ జిల్లా పార్టీ నూతన అధ్యక్షుడిగా అరుట్ల దశమంత్​ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు.

Arutla Dashamanth Reddy BJP New President of Janagama district
జనగామ జిల్లా భాజపా నూతన అధ్యక్షుడి నియమకం

జనగామ జిల్లా నూతన భాజపా అధ్యక్షుడిగా అరుట్ల దశమంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని జిల్లా నూతన పార్టీ కార్యాలయన్ని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు.

తనను నమ్మి ఇంత పెద్ద బాధ్యతను అప్పజెప్పిన పార్టీ రాష్ట్ర అధిష్ఠానానికి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ పట్ల విధేయుడిగా ఉంటూ కార్యకర్తలను కలుపుకుపోతానని వెల్లడించారు. లాక్​డౌన్​ నేపథ్యంలో నిరుపేదలను ఆర్థికంగా ఆదుకుంటామని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details