తెలంగాణ

telangana

ETV Bharat / state

తల్లి,తమ్ముడి మరణం తట్టుకోలేక యువతి ఆత్మహత్య

తల్లి, తమ్ముడు చనిపోయారని ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. తమ్ముడు పుట్టిన రోజునే ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన జగిత్యాల జిల్లా తాటిపల్లిలో చోటుచేసుకుంది.

తల్లి,తమ్ముడి మరణం తట్టుకోలేక యువతి ఆత్మహత్య

By

Published : Nov 8, 2019, 9:32 AM IST

Updated : Nov 8, 2019, 2:05 PM IST

జగిత్యాల జిల్లా తాటిపల్లిలో యువతి ఆత్మహత్య ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. తల్లి, తమ్ముడు మృతి చెందారని... సుందరగిరి మేఘన(22) ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

అసలేం జరిగిందంటే..?

గతేడాది సెప్టెంబర్‌ 12న తమ్ముడు రఘు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కొడుకు మృతి తట్టుకోలేక అతని తల్లి ఉమ రెండు నెలలకే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

డిగ్రీ పూర్తి చేసిన మేఘన ఏడాది కాలంగా తండ్రి కిషన్‌తో అద్దె ఇంట్లో ఉంటున్నారు. తండ్రి ఇంట్లో లేని సమయంలో మేఘన తన తమ్ముడు రఘు పుట్టిన రోజునే ఈ ఘాతుకానికి పాల్పడింది.

ఒకే ఇంట్లో ముగ్గురు మృతి చెందడంతో తండ్రి కిషన్‌ ఒక్కరే మిగిలారు. ఈ ఘటనతో తాటిపల్లిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆమె మృతితో గ్రామస్థులు కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఒకే ఇంట్లో ముగ్గురు మృతి చెందడం పట్ల గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

తల్లి,తమ్ముడి మరణం తట్టుకోలేక యువతి ఆత్మహత్య

ఇదీ చదవండిః తహసీల్దార్‌ విజయారెడ్డి హత్య కేసు నిందితుడు సురేశ్​ మృతి

Last Updated : Nov 8, 2019, 2:05 PM IST

ABOUT THE AUTHOR

...view details