సివిల్ సర్వీసెస్‌కు ఎంపికై శిక్షణ తీసుకుంటున్న యువ అధికారులు వివేక్ ధూళియ, శుభ్రనిందా, ధర్మవీర్ దైరు జగిత్యాల జిల్లాలో క్షేత్రస్థాయి సందర్శనకు వెళ్లారు. గ్రామాల్లో పర్యటించి అక్కడి మౌలిక సదుపాయాలు, సమస్యలు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం కొడిమ్యాల మండలం హిమ్మత్‌రావుపేటలో పర్యటిస్తున్న శిక్షణ అధికారులు తెలిపారు. అభివృద్ధిలో ముందున్న గ్రామ విషయాలను స్థానికులను అడిగి తెలుసుకున్నట్లు వివరించారు.
గ్రామాల్లో పర్యటిస్తూ... సమస్యల గురించి తెలుసుకుంటూ - జగిత్యాల వార్తలు
క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ... అక్కడ సదుపాయాలు, సమస్యల గురించి తెలుసుకుంటున్నారు సివిల్ సర్వీసెస్‌కు ఎంపికై శిక్షణ తీసుకుంటున్న అధికారుల బృందం. గ్రామంలోని అభివృద్ధి విషయాల పట్ల స్థానికులతో చర్చిస్తున్నారు.
గ్రామాల్లో పర్యటిస్తూ... సమస్యల గురించి తెలుసుకుంటూ