ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ల పిలుపు మేరకు ప్రజలు, ప్రజాప్రతినిధులు జనతా కర్ఫ్యూలో పాల్గొన్నారు. కర్ఫ్యూలో భాగంగా జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. కుటుంబసభ్యులతో రోజంతా గడిపారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం చేపట్టే చర్యలకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.
జనతా కర్ఫ్యూ : ఇంటికే పరిమితమైన జగిత్యాల ఎమ్మెల్యే - Jagitial Janatha Curfew Corona Effect
కరోనా వ్యాప్తి కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన జనతా కర్ఫ్యూలో అన్నివర్గాల వారు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. కర్ఫ్యూలో భాగంగా జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ తన కుటుంబ సభ్యులతో సహా స్వీయ నిర్బంధంలో ఉన్నారు.
![జనతా కర్ఫ్యూ : ఇంటికే పరిమితమైన జగిత్యాల ఎమ్మెల్యే Jagityala MLA](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6511595-745-6511595-1584937562732.jpg)
Jagityala MLA
వృత్తిరీత్యా వైద్యుడైన ఆయన కరోనా మహమ్మారిని ఏ విధంగా దూరం చేయవచ్చనేది వివరించారు. చేతులు శుభ్రంగా కడుక్కోవాలని, మాస్కులు ధరించాలని, మనిషికి మనిషి తాకకుండా ఉండాలని అన్నారు. స్వీయ నియంత్రణతోనే కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని ఎమ్మెల్యే తెలిపారు.
జనతా కర్ఫ్యూ : ఇంటికే పరిమితమైన జగిత్యాల ఎమ్మెల్యే
ఇవీ చూడండి: లాక్డౌన్లో వీటికే మినహాయింపు..