పెళ్లి ఓ మధురైన ఘట్టం. జీలకర్ర బెల్లం, మాంగళ్యాధారణ, ముత్యాల తలంబ్రాలు, ఏడడుగులు, అరుంధతి నక్షత్రం... ఇలా ప్రతి సన్నివేశంలో ఓ అర్థం దాగి ఉంటుంది. అయితే వధువుకు వరుడు అరుంధతి నక్షత్రాన్ని చూపించడం... ఓ ప్రత్యేకత. సప్తరుషుల్లో ఒకరైన వశిష్టుడు, అరుంధతి దంపతులది అన్యోన్యమైన దాంపత్యం. వారి జీవితం చాలా సంతోషంగా సాగింది. అందుకే అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు.
వధువుకు టెలిస్కోప్‌లో అరుంధతి నక్షత్రం చూపించిన వరుడు
పెళ్లిలో వరుడు వధువుకు అరుంధతి నక్షత్రాన్ని చూపించడం సంప్రదాయం. అయితే ఆనవాయితీకి సాంకేతికత జోడించి అందరిని ఆకర్షించాడో భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కల్వకోటలో చోటుచేసుకుంది.
వధువుకు టెలిస్కోప్‌లో అరుంధతి నక్షత్రం చూపించిన వరుడు
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కల్వకోటలో జరిగిన పెళ్లిలో దీనికి ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. పెళ్లికొడుకు రాయకల్‌కు చెందిన అభయ్‌రాజ్ భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడు. కల్యాణ వేదిక మీద టెలిస్కోప్ ఏర్పాటు చేసి... వధువుకు అరుంధతి నక్షత్రాన్ని చూపించడం అందరిని ఆకర్షించింది.
ఇదీ చూడండి:హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్‌కు కరోనా పాజిటివ్
Last Updated : Jul 26, 2020, 10:07 PM IST