తెలంగాణ

telangana

ETV Bharat / state

మలేషియాలో తెలంగాణ వాసి మృతి - one man death in malaysia

ఊళ్లో ఉపాధి కరవై బతుకు తెరువు కోసం విదేశాలకు వెళ్లిన ఓ కార్మికుడు పనిచేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందాడు. కుటుంబ సభ్యులు మృతదేహం కోసం ఊరిపెద్దలతో మెురపెట్టుకోగా... వారు మలేషియా తెలంగాణ అసోసియేషన్​తో మాట్లాడి ఏర్పాట్లు చేశారు.

మలేషియాలో తెలంగాణ వాసి మృతి

By

Published : Oct 22, 2019, 5:40 PM IST

జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తాళ్ల ధర్మారం గ్రామానికి చెందిన తట్ర రాజం ఇటీవల మలేషియాలోని జోహార్ బారు ప్రాంతంలో అతను పనిచేసే చోట ప్రమాదానికి గురై మృతిచెందాడు. ఈ విషయాన్ని వాళ్ల గ్రామ సర్పంచ్ మహిపాల్ రెడ్డి, ఎంపీటీసీ రమేష్ మలేషియా తెలంగాణ అసోసియేషన్​కు తెలియజేశారు. ఈ విషయం తెలుసుకున్న ప్రెసిడెంట్ సైదం తిరుపతి, వైస్ ప్రెసిడెంట్ బూరెడ్డి మోహన్ రెడ్డి, మైగ్రేట్ వింగ్ కోఆర్డినేటర్ ప్రతీక్ ఆసుపత్రికి వెళ్లి అతని పూర్తి సమాచారాన్ని తెలుసుకున్నారు. మలేషియాలోని ఇండియన్ ఎంబసీని సంప్రదించి అతని పార్థివ దేహాన్ని వారి గ్రామానికి చేరడానికి కావలిసిన పత్రాలను సేకరించారు. ఆ పత్రాలను మలేషియా హై కమిషన్​కి ఇచ్చి వారితో సంప్రదింపులు జరిపి మృతదేహాన్ని హైదరాబాద్​కు పంపేలా ఏర్పాట్లు చేశారు. తెలంగాణ ప్రభుత్వం వారి గ్రామం వరకు ఉచిత అంబులెన్సు సౌకర్యాన్ని కల్పించింది. మృతదేహం గ్రామానికి చేరుకుంది.
బతుకుదెరువు కోసం మలేషియా వచ్చిన తట్ర రాజంకు ఒక బిడ్డ, ఒక కొడుకు వున్నారు. వీరి కుటుంబం చాలా బీద కుటుంబం. అందరు ఈయన మీదనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. తెలంగాణ ప్రభుత్వం ఇతని కుటుంబాన్ని ఏదో రకంగా ఆదుకోవాలని మలేషియా తెలంగాణ అసోసియేషన్ కోరింది.

మలేషియాలో తెలంగాణ వాసి మృతి

ABOUT THE AUTHOR

...view details