మస్కట్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన లక్ష్మీభవాని (23) అనే వివాహిత శంషాబాద్ ఎయిర్పోర్టులో అదృశ్యమైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా కు చెందిన లక్ష్మీభవాని... మస్కట్‌లో పనిచేస్తున్న తన భర్తను చూసేందుకు విజిటింగ్ వీసాపై వెళ్లింది. ఈ నెల 9న బయలుదేరి 10న శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. ఇంటికి తీసుకెళ్లేందుకు తన తమ్ముడు కొంత ఆలస్యంగా వచ్చాడు. తన అక్క కన్పించకపోవటం వల్ల ఇంటికి వెళ్లిపోయిందేమోనని భావించాడు. ఇంటికి కూడా రాకపోవటం వల్ల అన్ని చోట్ల వెతికారు. ఎంతకీ లాభం లేకపోగా... ఎయిప్పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. విమానాశ్రయంలో దిగిన లక్ష్మీభవాని... బయటకు వచ్చినట్టు దృశ్యాలున్నాయని పోలీసులు తెలిపారు. అక్కడి నుంచి ఎటు వెళ్లిందన్న విషయంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మస్కట్ నుంచి 10నే వచ్చింది కానీ ఇప్పటికీ ఇంటికి రాలేదు! - శంషాబాద్ ఎయిర్పోర్టులో అదృశ్యం
భర్తను చూసేందుకు మస్కట్‌కు వెళ్లింది ఆ మహిళ. తిరిగి హైదరాబాద్‌కు ఈ నెల 10న చేరుకుంది. తనను రిసీవ్ చేసుకునే తమ్ముడు కాస్త ఆలస్యంగా రాగా... ఎయిర్‌పోర్టు బయటకు వెళ్లింది. మరి అటు నుంచి ఎక్కడి వెళ్లింది... ఏమైంపోయింది... అన్నది మాత్రం తెలియదు. ఇంటికి మాత్రం ఇప్పటికీ రాలేదు...!