జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని రామన్నపేట, నూకపల్లి, మల్యాల తదితర ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్సీ టి. జీవన్‌రెడ్డి పరిశీలించారు. ధాన్యం కొనుగోళ్ల ఆలస్యం... మిల్లర్ల మోసాలపై ఆయన మండిపడ్డారు. ఒక్కో బస్తాపై రెండు కిలోల చొప్పున అదనంగా తూకం వేస్తున్నారన్నారు. మిల్లర్ల కోసం అధికారులు, ప్రభుత్వం పని చేస్తుందని ఆయన ఆరోపించారు. మోసాన్ని అరికట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మిల్లర్లు మోసం చేస్తున్నారని జీవన్‌రెడ్డి మండిపాటు - మిల్లర్లు మోసం చేస్తున్నారని జీవన్‌రెడ్డి మండిపాటు
జగిత్యాల జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను కాంగ్రెస్ ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి పరిశీలించారు. ధాన్యం కొనుగోళ్లలో మిల్లర్లు మోసం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
మిల్లర్లు మోసం చేస్తున్నారని జీవన్‌రెడ్డి మండిపాటు
నష్టాల్లో ఉన్న రైతులను ఇప్పుడు తూకంలో మోసం చేసి నిలువునా ముంచుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 40 కిలోల తూకం వేయాల్సిన అధికారులు 42 కిలోలు తూకం ఎలా వేస్తారని ప్రశ్నించారు. ఆయనతోపాటు రైతులు, కాంగ్రెస్ సీనియర్ నేత మేడిపల్లి సత్యం పాల్గొన్నారు.
ఇవీ చూడండి:ప్రతి కుటుంబానికి రూ.5 వేలు ఇవ్వాలి: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి