తెరాస ప్రభుత్వం కులవృత్తులకు ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ పేర్కొన్నారు.
ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే..
తెరాస ప్రభుత్వం కులవృత్తులకు ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ పేర్కొన్నారు.
ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే..
జగిత్యాల జిల్లా అన్నపూర్ణ చౌరస్తాలో రూ. 10 లక్షల ఎంపీ నిధులతో నిర్మించిన గంగపుత్రుల సంఘ భవనాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకువచ్చిందని తెలిపిన ఎమ్మెల్యే.. గంగపుత్రులకు వాహనాలు అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్తు ఛైర్‌పర్సన్ దావ వసంత, జగిత్యాల మున్సిపల్ ఛైర్‌పర్సన్ బోగ శ్రావణి తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:ఫిబ్రవరి నుంచి పాఠశాలల పునః ప్రారంభం.. వారికి మాత్రమే!