తెలంగాణ

telangana

By

Published : Aug 3, 2020, 6:53 PM IST

ETV Bharat / state

రైతుల శ్రమదానం.. పోతారం చెరువుకు మరమ్మతులు

జగిత్యాల జిల్లాలోని పోతారం చెరువుకు రైతులంతా కలిసి మరమ్మతులు చేశారు. సూరంపేట, గంగారాం తండా ప్రజలు సమష్టిగా ఏర్పడి చెరువు మత్తడి ఎత్తు పెంచి తమ గ్రామాల్లో ఏర్పడిన సాగునీటి కొరతను తీర్చుకున్నారు.

Local village farmers repairing works to the Potharam pond in jagtial district
రైతుల శ్రమదానం.. పోతారం చెరువుకు మరమ్మతులు

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పోతారం చెరువుకు రైతులంతా శ్రమదానం చేసి మరమ్మతులు చేసుకున్నారు. సూరంపేట, గంగారాం తండా గ్రామాల్లో సాగునీటి కొరత ఏర్పడటం వల్ల పోతారం చెరువుకు మత్తడి ఎత్తు పెంచుకున్నారు. గతంలోనే మత్తడి నిర్మాణం పనులకు ప్రభుత్వం ప్రతిపాదించినా స్థానికుల అభ్యంతరాలతో పనులు నిలిచాయి. గత ఏడాది ప్రభుత్వం పోతారం చెరువుకు పంప్​హౌస్ ఏర్పాటు చేసింది.

అక్కడి నుంచి శ్యామల చెరువు, సూరంపేట, కొండాపూర్, నల్లగొండ, చెప్యాల చెరువులు నిండాయి. అయితే కొడిమ్యాల మండలంలోని సుమారు పదివేల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశముంది. కానీ మత్తడి సమస్యతో సాగునీటి ప్రణాళిక నిలిచిపోయిందని గ్రహించిన సూరంపేట, గంగారాంతండా గ్రామస్థులు ఈఏడు పంటలకు సాగునీరు కల్పించేందుకు ముందుకు కదిలారు. సమష్టి నిర్ణయంతో తాత్కాలికంగా మత్తడి ఎత్తు పెంచుకుని సమస్యకు పరిష్కారం వెతుక్కున్నారు.

ఇవీ చూడండి:రాఖీ స్పెషల్... వీరి అనుబంధం.. దేశానికే రక్ష కావాలి..

ABOUT THE AUTHOR

...view details