జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం బోల్లోనిచెరువు గ్రామంలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆలయ నిర్మాణ పనుల్లో భాగంగా ధ్వజస్తంభం ఏర్పాటుకు క్రేన్ ఉపయోగించారు. కానీ ధ్వజస్తంభం బరువుతో క్రేన్ అదుపు తప్పి పక్కకు పడిపోయింది. ఈ ఘటనలో ఆలయం గోడ కూలింది.
ధ్వజ స్తంభం ఏర్పాటులో.. బోల్తా కొట్టిన క్రేన్
ఆలయ ధ్వజస్తంభం స్థాపనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.. క్రేన్ సాయంతో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించగా..క్రేన్ ఒక్కసారిగా అదుపుతప్పి పక్కకు పడిపోయింది. ప్రమాదంలో ఆలయం గోడ కూలగా.. డ్రైవర్ స్వల్ప గాయాలతో తప్పించుకున్నాడు.
ధ్వజ స్తంభం ఏర్పాటులో.. బోల్తా కొట్టిన క్రేన్
ఆపరేటర్ చాకచక్యంగా దూకటం వల్ల స్వల్ప గాయాలతో బయట పడ్డాడు. హనుమాన్ ఆలయం ఆవరణలో త్రుటిలో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు.
ఇదీ చూడండి :ఆంధ్రప్రదేశ్‌కు తరలిస్తున్న మద్యం పట్టివేత