తెలంగాణ

telangana

ETV Bharat / state

అకాల వర్షానికి తడిసిన ధాన్యం - grain wet

శుక్రవారం కురిసిన వర్షానికి కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. జగిత్యాల జిల్లా ధర్మపురి, బుగ్గారం మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో నీరు నిలిచి ధాన్యం పూర్తిగా మునిగిపోయింది.

అకాల వర్షానికి తడిసిన ధాన్యం
అకాల వర్షానికి తడిసిన ధాన్యం

By

Published : Jan 4, 2020, 7:01 PM IST

జగిత్యాల జిల్లా ధర్మపురి, బుగ్గారం మండలాల్లో కురిసిన వర్షానికి... కోనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. ధర్మపురి మార్కెట్ యార్డులో నీళ్లు నిలవడం వల్ల... నీళ్లలో నుంచి ధాన్యాన్ని ఎత్తుకోవాల్సి వచ్చింది. తేమశాతం రావడం లేదంటూ... నెల రోజుల పాటు కోనుకోలు కేంద్రాల్లోనే ఉంచారు. ఇప్పుడు వర్షానికి పంట తడవటం వల్ల రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రాల్లో తూకం వేయకుండా వివక్ష చూపిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. కేంద్రాల్లో నిత్యం నరకం అనుభవిస్తున్నప్పటికీ... అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు.

అకాల వర్షానికి తడిసిన ధాన్యం

ABOUT THE AUTHOR

...view details