జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన ఆవిర్భావ వేడుకల్లో ఓ యువకుడు పురుగుల మందు డబ్బాతో ఆందోళకు దిగాడు. కార్యక్రమం కొనసాగుతుండగా... అక్కడికి వెళ్లిన మధు.. అధికారులు తమ భూ సమస్య పరిష్కరించటం లేదంటూ వేడుకలకు హాజరైన ప్రభుత్వ విప్ భానుప్రకాశ్‌రావు కాళ్లు పట్టుకున్నాడు. జిల్లాలోని మాహదేవ్ పూర్ మండల కేంద్రానికి చెందిన పెద్దింటి మధు అనే యువకుడి 3 ఎకరాల 30 గుంటల భూమి.. అదే గ్రామానికి చెందిన ఆరెందుల సత్యనారాయణ పేరున పట్టా అయింది.
ఆవిర్భావ వేడుకల్లో అన్నదాత ఆత్మహత్యాయత్నం
రైతు... పంట పండించి కడుపు నింపడమే తెలుసు. ఒకరి పొట్టకొట్టడం తెలియదు. తనకు జీవనాధారమైన భూమి వేరే వారి పేరు మీద పట్టా అయిందని తెలుసుకున్నాడు ఓ యువరైతు. ఈ విషయాన్ని అధికారులతో మొరపెట్టుకున్నాడు. 3 సంవత్సరాల నుంచి కాళ్లు అరిగేలా కార్యాలయాల చుట్టూ తిరిగినా... ప్రయోజనం శూన్యం. ఎలాగైనా తన సమస్యను విన్నవించుకోవాలనుకున్నాడు. రాష్ట్రం సిద్ధించిన రోజే.. ఆత్మాభిమానం చంపుకుని.. ప్రభుత్వ విప్ కాళ్లు పట్టుకున్నాడు. పురుగుల మందు డబ్బాతో ఆత్మహత్యకు యత్నించాడు.
పురుగుల మందుతో రైతు ఆవేదన
ఏళ్ల తరబడిగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవటం లేదంటూ మధు ఆత్మహత్యకు యత్నించాడు. అక్కడే ఉన్న పోలీసులు మధును పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటన కలెక్టర్ అబ్ధుల్ అజీమ్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, జడ్పీ ఛైర్పర్సన్ జక్కు శ్రీహర్షిని, అధికారులు, ప్రజాప్రతినిధులు ముందే జరిగింది.
ఇవీ చూడండి:ఐదుగురు పిల్లలకు ఆస్తి పంచారు.. ఆ తర్వాత...