తెలంగాణ

telangana

By

Published : Sep 23, 2020, 1:03 AM IST

ETV Bharat / state

కుల వృత్తి దెబ్బతింటోంది.. అందుకే ఈ వలసలు : గల్ఫ్ గంగపుత్ర సంఘం

తెలంగాణ గల్ఫ్ గంగపుత్ర సంఘం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దుబాయిలో సంఘం సమావేశమైంది. ఉన్న ఊరిలో ఉపాధి కరవై గల్ఫ్​కు వలసలు వచ్చామని.. ఇక్కడే జీవనోపాధి పొందుతున్నామని సంఘం వెల్లడించింది. దుబాయిలో ఉంటూ తమ కులహక్కులు, మత్స్య సొసైటీలను కాపాడుకుంటామని స్పష్టం చేసింది.

కుల వృత్తి దెబ్బతింటోంది.. అందుకే ఈ వలసలు : గల్ఫ్ గంగపుత్ర సంఘం
కుల వృత్తి దెబ్బతింటోంది.. అందుకే ఈ వలసలు : గల్ఫ్ గంగపుత్ర సంఘం

జగిత్యాల జిల్లాలోని పలు గ్రామాల్లో పెద్ద ఎత్తున ఉన్న గంగపుత్రులు ఉపాధి నిమిత్తం గల్ప్ దేశాల వలస బాట పట్టామని తెలంగాణ గల్ఫ్ గంగపుత్ర సంఘం అధ్యక్షుడు సముద్రాల శ్రీనివాస్ గంగపుత్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితంగా ఇక్కడే జీవన ఉపాధి పొందుతున్నామని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగాల కోసం ఎడారి దేశంలో నివసిస్తున్నామన్నారు. తెలంగాణ గల్ఫ్ గంగపుత్ర సంఘం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దుబాయిలో సంఘం నేతలు సమావేశం నిర్వహించారు.

గంగపుత్రుల పరిస్థితి అగమ్యగోచరం..

స్వగ్రామానికి తరలివచ్చి కుల వృత్తి చేసుకుందామంటే రాష్ట్రంలో సాంప్రదాయ మత్స్యకారులు గంగపుత్రుల పరిస్థితి దారుణంగా తయారైందని ప్రధాన కార్యదర్శి తిరుపతి గంగపుత్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వగ్రామాల్లో ఉన్న తమ సొసైటీలకు ప్రభుత్వం సరైన మౌలిక వసతులు కల్పించట్లేదని ఆందోళన వెలిబుచ్చారు. ఈ క్రమంలో ప్రభుత్వం జీఓ నెంబర్ 6 పేరిట తమ ఉపాధికి గండి కొట్టిందని ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ప్లకార్డులు పట్టుకుని గంగపుత్రులు నిరసన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం విఫలం..

కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతూ వివిధ పథకాలను ప్రవేశపెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం గంగపుత్రులను ఆదుకోవడంలో విఫలమైందన్నారు. ఇప్పటికైనా తెలంగాణలో గంగపుత్రుల కుల వృత్తి చేపల వేట, మత్స్య సొసైటీలను కాపాడి ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. ఫలితంగా విదేశాలకు వలసలు తగ్గుతాయన్నారు.

ఓట్ల రాజకీయం కోసమే..

ఓట్ల కోసం తమ కుల వృత్తిని, సొసైటీ సభ్యత్వాల్ని ఇతర కులాలకు కట్టబెట్టడాన్ని తిరుపతి ఖండించారు. ఈ పరిస్థితుల్లో తాము తెలంగాణకు వచ్చి ఎలా బతకగలమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దుబాయిలో ఉంటూనే తమ కుల వృత్తి పరిరక్షణకు గల్ఫ్ గంగపుత్ర సంఘం ద్వారా కృషి చేస్తామని తిరుపతి స్పష్టం చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి గల్ఫ్ గంగపుత్ర సమస్యలు తీర్చాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు తోకల శంకర్, సహాయ కార్యదర్శి బింగి నర్సయ్య, కార్యదర్శి జెల్ల వెంకటేష్, కోశాధికారి యాదగిరి, గౌరవ సలహాదారుడు పల్లికొండ రాములు, బోరే ఇంద్రయ్య, మేకల సాయి కుమార్ , పల్లికొండ గంగ నరసయ్య , అధికార ప్రతినిధి గంగరాజం , నరేష్ గంగపుత్ర, గుమ్ముల రాజేశం తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి : 'సీతారామ ప్రాజెక్టు జలాలతో 3 జిల్లాలకు సాగునీరు అందాలి'

ABOUT THE AUTHOR

...view details