తెలంగాణ

telangana

By

Published : Apr 9, 2021, 4:56 PM IST

ETV Bharat / state

మాస్క్​ లేకుండా తిరిగితే ఫైన్​ కట్టాల్సిందే..!

జగిత్యాల జిల్లా మెట్​పల్లి పట్టణంలో అధికారులు, పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. మాస్కులు ధరించని వారికి రూ.1000 చొప్పున జరిమానా విధించారు. కరోనా నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

మెట్​పల్లిలో మాస్క్​ లేకుంటే ఫైన్​
మెట్​పల్లిలో మాస్క్​ లేకుంటే ఫైన్​

రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. మాస్కులు ధరించడం పట్ల ప్రజలకు మరింత అవగాహన కల్పిస్తున్నారు. జగిత్యాల జిల్లా మెట్​పల్లి పరిధిలోని 26 వార్డుల్లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఫలితంగా వివిధ గ్రామాల నుంచి అవసరాల నిమిత్తం మెట్​పల్లికి వచ్చే వారికీ వైరస్​ సోకుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ఆర్డీవో వినోద్ కుమార్, పురపాలక కమిషనర్ సమ్మయ్య, పోలీసులు సమష్టిగా తనిఖీలు చేపట్టారు. మాస్కులు ధరించని వారికి రూ.1000 చొప్పున జరిమానా విధించారు. ఈ సందర్భంగా వ్యాపారస్థులకూ పలు సూచనలు చేశారు. కరోనా బారినపడకుండా ప్రజలు నిబంధనలు పాటించాలని, అలా పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చూడండి: 'గాంధీలో కరోనా చికిత్సతో పాటు సాధారణ వైద్య సేవలు యధాతథం'

ABOUT THE AUTHOR

...view details