ఊబకాయం తగ్గాలంటే సమతుల ఆహారాన్ని తీసుకోవాలని.. దేశంలో ఊబకాయంతో బాధపడేవారి సంఖ్య నానాటికీ పెరుగుతోందని సన్షైన్ ఆసుపత్రి ఎండీ గురువారెడ్డి స్పష్టం చేశారు. ప్రపంచ స్థూలకాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆస్పత్రి ఆవరణలో ఊబకాయ సమస్యతో బాధపడుతున్న వారికి పేషెంట్ సపోర్ట్ గ్రూప్ ద్వారా బేరియాట్రిక్ సర్జరీపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. బయట దొరికే చిరుతిండి, ఫాస్ట్ఫుడ్ తినడం వల్ల ఊబకాయం వచ్చే అవకాశముందని గురువారెడ్డి అన్నారు. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వారికి బేరియాట్రిక్ సర్జరీకి ఇన్సూరెన్స్ కూడా అందుబాటులో ఉందని పేర్కొన్నారు..ఈ సర్జరీ ద్వారా త్వరగా బరువు తగ్గి ఆరోగ్యంగా ఉండవచ్చన్నారు. వ్యాయామం చేస్తూ మంచి ఆహారాన్ని తీసుకుంటే ఊబకాయ సమస్య దరిచేరదని ఆయన అన్నారు
'సమతుల ఆహారాన్ని తీసుకుంటే ఊబకాయం దరిచేరదు'
ప్రపంచ స్థూలకాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం సన్షైన్ ఆస్పత్రిలో ఊబకాయ సమస్యతో బాధపడుతున్న వారికి బేరియాట్రిక్ సర్జరీపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వ్యాయమం చేస్తూ సమతుల ఆహారాన్ని తీసుకుంటే ఊబకాయం తగ్గుతుందని ఆస్పత్రి ఎండీ గురువారెడ్డి తెలిపారు.
'సమతుల ఆహారాన్ని తీసుకుంటే ఊబకాయం దరిచేరదు'