మహారాష్ట్రకు చెందిన అసద్, షరీఫ్, అయూబ్పై హైదరాబాద్ రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ పీడీ కేసు నమోదు చేశారు. ఉపాధి పేరిట బంగ్లాదేశ్ యువతుల్ని నగరానికి తీసుకొచ్చి వారితో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్న కేసులో... పహాడీషరీఫ్ పోలీసులు ఈ నెల 21న 10 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో మహారాష్ట్రకు చెందిన ఈ ముగ్గురు... మహిళల అక్రమ రవాణాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. 10మందిని అరెస్ట్ చేసి అక్టోబర్ 21న చర్లపల్లి జైలుకు పంపించారు. అసద్, షరీఫ్, అయూబ్పై గతంలోనూ అక్రమ రవాణా కేసులుండటం వల్ల నిందితులపై పీడీ చట్టం కింద కేసు నమోదు చేశారు. చర్లపల్లి కేంద్ర కారాగారంలో ఖైదీలుగా ఉన్న ముగ్గురు యువకులు మరో ఏడాది పాటు జైల్లోనే ఉండనున్నారు.
మహిళల అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురిపై పీడీ యాక్ట్
మహిళల అక్రమ రవాణా చేస్తోన్న ముగ్గురిపై రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ పీడీ చట్టం ప్రయోగించారు. ఈ నెల 21న 10 మందిని అరెస్టు చేయగా.. ఈ ముగ్గురిపై గతంలోనూ కేసులు ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
మహిళల అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురిపై పీడీ యాక్ట్
ఇవీ చూడండి : 'రాముడిని నిత్యం స్మరించే భాజపా నిజం చెప్పాలి'
TAGGED:
women trafficking