వేధించాడు..ఇలా చేసింది.. - ARREST
ఆమె ఓ సాధారణ మహిళ.. సామాజిక మాధ్యమాల్లో వేధింపులు తట్టుకోలేక పోయింది. సమస్యను చూసి పారిపోకుండా.. ధైర్యంగా నిలబడింది. తన తెలివితో నిందితునికి గుణపాఠం చెప్పింది.
వేధించాడు..ఇలా చేసింది..
హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న సరళకు దుబాయ్‌కి చెందిన డాలీ వాట్సప్‌లో పరిచయమైంది. ఆమె మొబైల్ నెంబర్ని ఆ అమ్మాయి తన స్నేహితునికి ఇచ్చింది. ఫోన్లో, సామాజిక మాధ్యమాల్లో సరళని వేధించటం మొదలుపెట్టాడు.
వేధింపులకు కుంగిపోకుండా ఆత్మస్థైర్యానికి బుద్ధిబలాన్ని జోడించి నిందితునికి గుణపాఠం చెప్పాలనుకుంది ఆ మహిళ. ప్రణాళిక ప్రకారంగా పోలీసులకు ముందుగానే సమాచారామిచ్చింది. దుండగున్ని హైదరాబాద్‌కి రప్పించి పోలీసులకు పట్టించింది.
వేధించాడు..ఇలా చేసింది..