తెలంగాణ

telangana

ETV Bharat / state

మున్సిపల్​ ఎన్నికలకు తెలుపు రంగు బ్యాలెట్‌ పత్రాలు - తెలంగాణ పురపాలక ఎన్నికలు

తెలంగాణలో పురపాలక ఎన్నికల బ్యాలెట్‌ పత్రాల ముద్రణ ఈరోజు సాయంత్రానికి పూర్తవుతుందని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి ఎం.అశోక్‌ కుమార్‌ తెలిపారు. ఈ ఎన్నికల్లో తెలుపు రంగు బ్యాలెట్‌ పత్రాలను వినియోగిస్తామన్నారు.

white ballot papers for telangana muncipal elections
మున్సిపల్​ ఎన్నికలకు తెలుపు రంగు బ్యాలెట్‌ పత్రాలు

By

Published : Jan 17, 2020, 8:52 AM IST

మున్సిపల్​ ఎన్నికల బ్యాలెట్​ పత్రాల ముద్రణ నేడు పూర్తవనుంది. పుర పోలింగ్​కు తెలుపు రంగు బ్యాలెట్​ పత్రాలను వినియోగిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి అశోక్​ కుమార్​ తెలిపారు. ఒక్కో వార్డు లేదా డివిజన్‌లో గరిష్ఠంగా పదిమంది కంటే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో లేరని వెల్లడించారు. ‘ఎన్నికల నిర్వహణకు పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నామని, పురపాలక ఎన్నికల్లో 44 వేలమంది ఎన్నికల సిబ్బంది, ఉద్యోగులు, పోలీసులు విధుల్లో ఉంటారు.

" ప్రతి పోలింగ్‌ కేంద్రంలో ఇద్దరు పోలీసులు విధుల్లో ఉంటారు. ప్రతి పది పోలింగ్‌ కేంద్రాలకు ఒక ప్రత్యేక పోలింగ్‌ అధికారి ఉంటారు. పోలింగ్‌స్టేషన్లలో వెబ్‌కాస్టింగ్‌తోపాటు వీడియో రికార్డింగ్‌ ఉంటుంది. ఎక్కడైనా వెబ్‌కాస్టింగ్‌ లేకుంటే అక్కడ విధిగా మైక్రో అబ్జర్వర్లు ఉంటారు. ఈ నెల 22న ఎన్నికలు జరిగే 120 పురపాలక సంఘాల్లోని 2727 వార్డుల్లో 6325 పోలింగ్‌ కేంద్రాలను, 9 కార్పొరేషన్లలో 325 డివిజన్లలో 1438 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశాం. కొంపల్లి పురపాలక సంఘంలో పది పోలింగ్‌ కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా ఫేస్‌ రికగ్నిషన్‌ యాప్‌ను వాడనున్నాం. దొంగ ఓట్లు వేయకుండా నివారించడం దీని లక్ష్యం’ అని వివరించారు. "

- రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి ఎం.అశోక్‌ కుమార్‌

భైంసా, పరకాలపై నివేదిక పంపండి

భైంసాలో ఎన్నికను వాయిదా వేయాలని భాజపా ఇచ్చిన వినతిపత్రంపై నిర్మల్‌ జిల్లా కలెక్టర్‌, ఎన్నికల పరిశీలకులను నివేదిక పంపాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. 22 వార్డులున్న పరకాల పురపాలక సంఘంలో 11 వార్డులు ఏకగ్రీవం కావడంపైనా జిల్లా కలెక్టర్‌, పరిశీలకులను రాష్ట్ర ఎన్నికల సంఘం వివరణ కోరింది.

ABOUT THE AUTHOR

...view details