రాబోయే రెండు, మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణం కేంద్రం ప్రకటించింది. అంతే కాకుండా ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు పడుతాయని చెబుతోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని... దీని ప్రభావం వల్ల వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ సంచాలకురాలు నాగరత్న తెలిపారు. ఆగస్టు నెలలో ద్రోణులు, అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉందని... వర్షాలు ఆశాజనకంగా కురిసే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ సంచాలకులు నాగరత్నతో ఈటీవీ భారత్ ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖి.
శుభవార్త: మరో రెండు రోజుల్లో వర్షాలు !
తెలుగు రాష్ట్రాలకు శుభవార్తే. వర్షకాలం వచ్చి రెండు నెలలు దాటుతున్నా... వాన జాడ లేక రైతన్న ఇబ్బందులు పడుతున్నారు. రైతు బాధ చూడలేక వరుణుడు కరుణించాడు. మరో రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.
శుభవార్త: మరో రెండు రోజుల్లో వర్షాలు !
Last Updated : Jul 24, 2019, 10:44 PM IST