హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కళింగ భవన్‌లో సిల్క్ మార్క్ ఇండియా ప్రదర్శనను రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రారంభించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన చేనేత కార్మికులు తయారు చేసిన సిల్క్ చీరల విశేషాలను గవర్నర్ అడిగి తెలుసుకున్నారు. పెళ్లి, వేడుకల సమయంలో సిల్క్ చీరలను ఎక్కువగా ధరిస్తారని ఆమె అన్నారు. తనకు ఈ చీరలంటే చాలా ఇష్టమన్నారు.
సిల్క్ చీరలను ఎక్కువగా ధరించండి : తమిళి సై
స్త్రీ తన జీవితంలో చీరకు అత్యంత ప్రాధాన్యతనిస్తుందని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. చేనేత కార్మికులు ఎంతో శ్రమించి తయారు చేసిన సిల్క్ మార్క్ చీరలను ధరించి వారిని ప్రోత్సహించాలని ఆమె కోరారు. బంజారాహిల్స్‌లో ఏర్పాటు చేసిన సిల్క్ మార్క్ ఇండియా ప్రదర్శనను ఆమె ప్రారంభించారు.
సిల్క్ చీరలను ఎక్కువగా ధరించండి : తమిళి సై
కొనుగోలుదారులు సిల్క్ చీరల ధరలు చూడవద్దని, వాటి తయారీ వెనుక కార్మికుల శ్రమను చూసి కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రదర్శన ఈనెల 17 వరకు ప్రదర్శన కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. సిల్క్ మార్క్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ సిల్క్ బోర్డ్, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్‌టైల్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
ఇదీ చూడండి :'మిగిలిన సమస్యలను రెండో విడతలో పూర్తి చేస్తాం..'