తెలంగాణ

telangana

ETV Bharat / state

'వక్ఫ్ భూములను కబ్జా చేస్తే కఠిన చర్యలు'

వక్ఫ్ భూములు కబ్జాచేసిన వారిని జైలుకు పంపిస్తామని బోర్డు ఛైర్మన్​ మహమ్మద్​ సలీమ్​ తెలిపారు. రంగారెడ్డి జిల్లా పహడిషరీఫ్​, మామిడిపల్లిలోని ఆక్రమణకు గురైన వక్ఫ్​ బోర్డు భూములను ఆయన పరిశీలించారు.

waqf lands
వక్ఫ్ భూములు కబ్జా చేసినవారిని జైలుకు పంపిస్తాం: ఛైర్మన్​

By

Published : Nov 17, 2020, 5:29 PM IST

వక్ఫ్ భూములు కబ్జాచేసిన వారిని జైలుకు పంపిస్తామని బోర్డు ఛైర్మన్​ మహమ్మద్​ సలీమ్​ తెలిపారు. రంగారెడ్డి జిల్లా పహడి షరీఫ్, మామిడిపల్లిలోని ఆక్రమణకు గురైన వక్ఫ్ బోర్డు భూములను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లోని అక్రమ నిర్మాణాలపై ఆరాతీశారు.

మామిడిపల్లిలోని సైఫ్​ జంగ్ అలీసాద్ వక్ఫ్ భూములు 718 ఎకరాల్లో 70 శాతం కబ్జాకు గురైందని తెలిపారు. నకిలీ పట్టాలు సృష్టించి రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని పేర్కొన్నారు. తమ భూములు కబ్జా చేసినవారిని జైలుకు పంపుతామన్నారు. ఆయా రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తామన్నారు.

అనంతరం హైదరాబాద్​ బండ్లగూడలోని వక్ఫ్ బోర్డు స్థలాలను పరిశీలించారు. భూములు కబ్జాకు గురవుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని.. ఎందుకు అడ్డుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వక్ఫ్ భూములను పరిశీలిస్తున్న బోర్డు ఛైర్మన్​

ఇవీచూడండి:వక్ఫ్​బోర్డు సీఈఓకు చట్టాలపై అవగాహనలేదు.. ఆయన అవసరమా?

ABOUT THE AUTHOR

...view details